సాంకేతికతతోనే ఉజ్వల భవిష్యత్తు:పీయూ వీసీ

సాంకేతికతతోనే ఉజ్వల భవిష్యత్తు:పీయూ వీసీ

MBNR: విద్యార్థులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పాలమూరు వర్సిటీ వీసీ జి.ఎన్. శ్రీనివాస్ సూచించారు. వర్సిటీలో ఫార్మసీ విద్యార్థులకు క్లినికల్ రీసెర్చ్, ఏఐ, ఉపాధి అవకాశాలపై నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక విలువలపై పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రవికాంత్, ప్రభాకర్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.