కొత్తగా 1.09 లక్షల మందికి పింఛన్లు

VZM: NTR భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసి నూతనం 1.09 లక్షల మందికి పంపిణీ చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెలే పింఛను ఇచ్చే విధానాన్ని అమలులోకి తెచ్చామన్నారు.