VIDEO: 'మేడారం మండ మెలిగే పండుగకు పటిష్ట భద్రత'
ములుగు జిల్లాలో ఈనెల 21న ప్రారంభమయ్యే మేడారం మండ మెలిగే పండుగ నుంచి జాతర ముగిసే వరకు భక్తులకు పూర్తి భద్రత కల్పిస్తామని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సమ్మక్క–సారలమ్మ పూజారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, పోలీసులు, పూజారులు, ఆదివాసీ యువత సమన్వయంతో పనిచేసి భక్తులకు సజావుగా అమ్మవార్ల దర్శనం కల్పించాలని సూచించారు.