ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు..ఇద్దరికి గాయాలు
NTR: నందిగామ మండలం ఐతవరం సమీపంలోని ఆదివారం మురుగన్ ధాబా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూలమలుపు తిరుగుతున్న ట్రాక్టర్‌ను నందిగామ వైపు నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొనడంతో ట్రాక్టర్ ముందు భాగం రెండు ముక్కలైంది. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే అదృష్టవశాత్తు ఇద్దరు డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు.