బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి
KMR: బిక్కనూర్ మండలంలోని బాగిర్తిపల్లి గ్రామం నుంచి పెద్ద మల్లారెడ్డి వెళ్లే రహదారిలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు బ్రిడ్జి దెబ్బతింది. ఈ క్రమంలో నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ, గ్రామ వార్డు సభ్యుడు రాజు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు కుమారస్వామి, పార్టీ నాయకులు ఉన్నారు.