పనులు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

పనులు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

NTR: చందర్లపాడు మండలంలోని రావులపాడు – ఏటూరు మధ్య నూతనంగా నిర్మాణం కాబడుతున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదివారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణం నాణ్యతతో పాటు పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రోడ్డు సౌకర్యం ఎంతో కీలకమని తెలిపారు. పనులు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను కోరారు.