'రైతు బజార్‌ను విముక్తి చేయండి'
KRNL: నగరంలోని సి. క్యాంప్ రైతు బజార్‌లో దళారుల ఆధిపత్యం పెరిగిందని, వాస్తవ రైతులకు అవకాశాలు లేకుండా పోయాయని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని దళారులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.