రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు..

MHBD: నెల్లికుదురు మండల కేంద్రం నుంచి ఇనుగుర్తి మండలం వరకు 11 కి.మీ. ప్రధాన రహదారి గుంతలతో నరకయాతనగా మారింది. హనుమన్ తండా వద్ద భారీ గుంతల్లో నీరు నిల్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు త్వరగా చేపట్టాలని స్థానికులు ఆదివారం డిమాండ్ చేశారు.