కడియపులంకలో 'బాల్య వివాహ ముక్త్ భారత్'
E.G: 'బాల్య వివాహ ముక్త్ భారత్' 100 రోజుల ప్రచార కార్యక్రమం కడియం మండలం కడియపులంక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం బాలల రక్షణ అధికారి జీ.క్రాంతిలాల్ మాట్లాడారు. బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండకముందే వివాహం చేయడం బాల్య వివాహమని అన్నారు.