VIDEO: రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొన్న ఎంపీ కావ్య

WGL:రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా 'జై బాపు, జైభీం, జై సంవిధాన్' అభియాన్ ర్యాలీ నిర్వహించారు. హనుమకొండ హరిత హోటల్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఇందులో వరంగల్ ఎంపీ కడియం కావ్యతోపాటు AICC సెక్రటరీ, తెలంగాణ ఇన్‌ఛార్జ్ విశ్వనాథన్ పెరుమాళ్‌తో కలసి MP పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణకై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యాత్ర చేస్తున్నట్టు ఎంపీ తెలిపారు.