సన్మాన సభకు సర్పంచ్ ఆప్సెంట్.!

సన్మాన సభకు సర్పంచ్ ఆప్సెంట్.!

GNTR: పెదకాకాని(మం) వెనిగండ్ల గ్రామంలో ఏప్రిల్ 2తో పదవీకాలం ముగిస్తున్న గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులకు, ఉప సర్పంచ్‌కు ఘనంగా వీడ్కోలు పలికి సోమవారం వారిని సన్మానించారు. ఈ సన్మాన సభలో పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అయితే, సర్పంచ్ ఈ సమావేశానికి రాకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.