ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
కోనసీమ: రామచంద్రపురంలో టీడీపీ కార్యాలయం వద్ద మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాలు ద్వారా మంత్రికి తెలియజేశారు. అర్జీదారుల సమస్యలను మంత్రి నేరుగా అడిగి తెలుసుకున్నారు. వచ్చిన ప్రతి సమస్యను పరిశీలించి తగిన న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.