మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్

మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్

PPM: కోమరాడ మండలం దళాయిపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మొక్కజొన్న పంట పొలాలను ఆయన స్వయంగా పరిశీలించి, రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. పంట పొలాల్లో మొక్కజొన్న మొక్కలు ఎండిపోయి, కంకులు ఆశించిన రీతిలో ఏర్పడకపోవడాన్ని ఆయన గమనించారు. సాగులో ఎదురవుతున్న ఇబ్బందులపై రైతులను అడిగి తెలుసుకున్నారు.