పందుల వల్ల రోడ్డు ప్రమాదాలు

పందుల వల్ల రోడ్డు ప్రమాదాలు

NLR: చేజర్ల మండలం ఆదురుపల్లిలో పందుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. గ్రామంలోని పెంచలకోన, కలువాయి రోడ్లపై శుక్రవారం రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని రెండు పందులు అక్కడికక్కడే చనిపోయాయి. ఈ ప్రమాదంలో వాహనాలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. వాహనదారులు స్వల్ప గాయాలతో బయటపడి చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.