రైలు నుంచి జారిపడ్డ వ్యక్తికి తీవ్రగాయాలు

NLR: గూడూరు నుంచి చెన్నై వైపు వెళ్లే రైల్వేట్రాక్ చిల్లకూరు సమీపంలో సోమవారం తెల్లవారుజామున రైలు నుంచి ఓ ప్రయాణికుడు జారి కిందపడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి గుంటూరు ప్రాంత వాసిగా గుర్తించారు. ఈ ఘటనపై 108 సిబ్బందికి సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.