శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద.. 39 గేట్లు ఎత్తవేత

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. మంగళవారం 2.75 లక్షల క్యూసెక్కులు చేరగా, 39 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. 1089 అడుగుల వరకు నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ఇంకా వరద పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.