'సైకిల్ తొక్కడం ఆరోగ్య అలవాటుగా స్వీకరించాలి'

KDP: ప్రతిఒక్కరూ సైకిల్ తొక్కడం ఆరోగ్య అలవాటుగా స్వీకరించాలని పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ అన్నారు. ఫిట్ నెస్ కీ దోస్తీ కార్యక్రమంలో భాగంగా పులివెందులలో ఆదివారం ఉదయం పోలీసులతో కలిసి ఆయన సైకిల్ తొక్కి అవగాహన కల్పించారు. సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.