'రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక'

'రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక'

మార్కాపురంలో సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసి అధికారులకు అందజేయాలని సూచించారు. జిల్లా వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.