'డయల్ యువర్ డీఎం' వినతుల పరిష్కారం

'డయల్ యువర్ డీఎం' వినతుల పరిష్కారం

మెదక్ ఆర్టీసీ డిపోలో ఇటీవల నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమంలో వచ్చిన సమస్యలను పరిష్కరించినట్లు డిపో అధికారులు తెలిపారు. ప్రతిరోజు రాత్రి గం.8:00 కు మెదక్ నుంచి బొడ్మట్ పల్లికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే రామయంపేట నుంచి కోమటిపల్లి మోడల్ స్కూల్ వరకు విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.