రేపు కుప్పంలో రూ.2 వేల కోట్లతో పరిశ్రమలకు శంకుస్థాపన
CTR: కుప్పం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో 7 పరిశ్రమల ఏర్పాటుకు CM చంద్రబాబు వర్చువల్ విధానంలో శనివారం శంకుస్థాపన చేయనున్నారు. కుప్పం ప్రాంతం పారిశ్రామిక వికాసం దిశగా ప్రగతి పథంలో ముందడుగు వేయడంలో భాగంగా రూ.2,203 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు రానున్నాయి. దీని ద్వారా దాదాపు 22 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు రానున్నాయి.