టీఎంసీ ఎంపీకి బెంగాల్ గవర్నర్ వార్నింగ్
TMC MP కళ్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలను బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ ఖండించారు. రాజ్ భవన్‌లో ఆయుధాలు ఇస్తున్నారని MP చేసిన ఆరోపణలు నిరాధారమైనవని వెల్లడించారు. ఈ ఆరోపణలను నిరూపించాలని లేకపోతే క్షమాపణలు చెప్పాలని తెలిపారు. అలా చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజ్ భవన్ తెరిచే ఉంటుందని ఎవరైనా వచ్చి ఆయుధాలు ఉన్నాయో లేవో చూసుకోవచ్చన్నారు.