శివస్వాముల ఇరుముడి మహోత్సవం
SRD: కల్హేరు మండల కేంద్రంలో శివస్వాముల ఇరుముడి మహోత్సవం ఘనంగా జరిగింది. జ్యోతి బాబా మఠం శివాలయంలో గురుస్వామి కుమ్మరి సాయిలు ఆధ్వర్యంలో 20 మంది దీక్షాపరులు ఇరుముడులు కట్టుకుని శ్రీశైల క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా భక్తులకు సంబు బీరుగొండ ఆధ్వర్యంలో మహా అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.