నగరంలో 24 గంటలపాటు బస్సులు నడపాలని డిమాండ్

HYD: HYD మహానగరంలో 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు సిటీలో నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తార్నాక, హబ్సిగూడ, ఎల్బీనగర్ లాంటి పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయాల్లో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ దీనిని ఆసరాగా చేసుకుని దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు.