ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ

ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ

దేశ కరెన్సీ విలువ ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 34 పైసలు క్షీణించి రూ.89.79కి చేరింది. FPIలు మన మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకోవడం, చమురు, బంగారం కొనుగోళ్లు, ఆర్‌బీఐ రేటు తగ్గింపుపై అంచనాలు తగ్గడం, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రూపాయి విలువ పడిపోయినట్లు నిపుణులు భావిస్తున్నారు.