నైట్ వాచ్ ఉమెన్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
ASF: చింతలమానెపల్లి మండల KGBVలో నైట్ వాచ్ ఉమెన్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాధికారి జయరాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. కేజీబీవీలో కాంట్రాక్టు పద్ధతిలో నైట్ వాచ్ ఉమెన్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులన్నారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సు ఉండాలన్నారు. ఈనెల 26వ తేదీ సాయంత్రంలోగా కేజీబీవీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.