మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన టిడిపి నాయకులు
ATP: మోకాలు ఆపరేషన్ చేయించుకున్న గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జితేంద్ర గౌడ్‌ను ఆయన గృహంలో టీడీపీ నాయకులు పరామర్శించారు. ఇటీవల హైదరాబాదులోని హాస్పిటల్లో జితేంద్ర గౌడ్ మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నారు. డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా టిడిపి నాయకులు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.