ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
CTR: తవణంపల్లె మండలంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. పుణ్యసముద్రం ఎల్బీపురం గ్రామానికి చెందిన బి.వెంకటేశ్ (54) వ్యర్థాలను ట్రాక్టర్ ట్రాలీలో లోడ్ చేసుకొని అగరంపల్లి వంతెన వద్దకు చేరుకున్నాడు. పందుల మేత కోసం బాహుదా నదిలో వ్యర్థాలను అన్‌లోడ్ చేసే సమయంలో ట్రాక్టర్ బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ చనిపోయాడని ఎస్సై చిరంజీవి తెలిపారు.