పాఠశాలలో మతప్రచారం ఫిర్యాదుపై అధికారుల తనిఖీ

కోనసీమ: కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లిలో సెయింట్ మదర్ స్కూల్‌లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మత ప్రచారం జరుగుతుందని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు సోమవారం రామచంద్రపురం డీవైఈవో రామలక్ష్మణరావు, ఎంఈవో తాతారావుతో కలిసి పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించారు.