శివమ్ దూబే రికార్డుకు బ్రేక్
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే (4) తేలిపోయాడు. ఈ క్రమంలోనే తన పేరిట ఉన్న ఓ రికార్డుకు బ్రేక్ పడింది. భారత్ తరఫున దూబే ఆడిన 37 మ్యాచ్‌ల తర్వాత తొలిసారి ఓటమిని చవిచూశాడు. ఇప్పటివరకు అతడు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించింది.