'ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు'

'ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు'

NLR: సంగం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యున్నత ప్రతిభ చాటిన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన ఎస్ఎస్‌సీ విద్యార్థులకు డిప్యూటీ డీఈవో జానకీ రామ్, అపాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రపాణి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాలెట్ తదితరులు పాల్గొన్నారు.