నేడు జిల్లా స్థాయి మత్స్యకారుల సమావేశం

NGKL: జిల్లా స్థాయి మత్స్యకారుల సమావేశం ఆదివారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు తెలిపారు. కంసాన్‌పల్లి గ్రామంలో మత్స్యకారుల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించి, నిన్న కరపత్రాలు విడుదల చేశారు. మత్స్యకారుల సమస్యలపై చర్చించనున్నారు.