VIDEO: జనగామ ఆర్టీసీ డిపో వద్ద కట్టుదిట్టమైన బందోబస్త్
జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద శుక్రవారం సమ్మె మూడో రోజు సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. నిన్న ఓ ఉద్యోగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఫైర్ ఇంజన్, అంబులెన్స్ ఏర్పాటు చేశారు. డిపో పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది.