'ప్రతి కాలనీ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి'
RR: హయత్ నగర్ వార్డు కార్యాలయంలో శానిటేషన్ అధికారులతో కార్పోరేటర్ నవజీవన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను సక్రమంగా నిర్వహించకపోవడం, చెత్తను తొలగించకపోవడం వలన ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి కాలనీ పరిశుభ్రంగా ఉండేలా చెత్త సేకరణ జరిగే విధంగా శానిటేషన్ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.