అనాథలైన చిన్నారులకు కార్తీక్ రెడ్డి అండ

అనాథలైన చిన్నారులకు కార్తీక్ రెడ్డి అండ

VKB: యాలాల మండలం హాజీపూర్‌కు చెందిన భవానీ, శివలీల అనే ఇద్దరు చిన్నారులకు BRS నేత, రాజేంద్రనగర్ ఇంఛార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అండగా నిలిచారు. చేవెళ్ల బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులు బందప్ప, లక్ష్మి దంపతులు మృతి చెందడంతో చిన్నారులు అనాథలైపోయారు. చిన్నారుల పరిస్థితి తెలుసుకున్న కార్తీక్ రెడ్డి వెంటనే స్పందించి, భవిష్యత్తు కోసం రూ. 2లక్షల ఆర్థిక సాయం అంజేశారు.