'స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం'
MBNR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర బీజేపీ ఇంఛార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం దేవరకద్ర పట్టణంలో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.