పట్టణ పరిశుభ్రతే ముఖ్యం : కమిషనర్

పట్టణ పరిశుభ్రతే ముఖ్యం : కమిషనర్

KRNL: ఎమ్మిగనూరు పట్టణ పరిశుభ్రతే ముఖ్యం అని మున్సిపల్ కమిషనర్ ఎన్. గంగిరెడ్డి అన్నారు. బుధవారం వేకువజామునే పట్టణంలోని గాంధీ నగర్, వైఎస్ఆర్ సర్కిల్ ఏరియాలలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. దగ్గరుండి పారిశుద్ధ్య కార్మికులకు తగు సూచనలు ఇస్తూ పనులు చేయించారు. కార్యక్రమంలో డీఈఈ మనోహర్‌రెడ్డి, టీపీఓ గోపాల కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.