శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ కేంద్రం
ASR: డుంబ్రిగూడ మండలం సోబురు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరింది. వర్షాలు పడితే భవనం లోపలికి నీరు కారుతూ చిన్నారులు, నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. స్లాబ్, గోడలపై పెచ్చులు ఊడిపడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనానికి ఇప్పటివరకు మరమ్మతులు చేయలేదని ఆరోపిస్తున్నారు.