రేపు ఎకో పార్క్ కాటేజీలు ప్రారంభం

రేపు ఎకో పార్క్ కాటేజీలు ప్రారంభం

MDK: నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎకో పార్క్ కాటేజీలు రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభిస్తారని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి అధికారులు హాజరుకావాలని కోరారు.