మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన నగర వాసి
HYD: థాయిలాండ్ దేశంలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మెహదీపట్నంకు చెందిన చింత సునంద భారతి సత్తా చాటారు. ఏప్రిల్ 17 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఈ అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో ఆమె మూడు విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ పతకాలు సాధించడం దేశానికే గర్వకారణమని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు..