'ఉపాధి కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలి'
AKP: ఉపాధి కార్మికులకు 12 వారాల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం బంగారమ్మ పాలెం,పెదఉప్పలం గ్రామాల్లో ఉపాధి హామీ కార్మికులతో సమావేశాలు నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేతనాలు సకాలంలో అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.