అయ్యప్ప మహా పడిపూజకు హాజరైన డీసీసీ అధ్యక్షులు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మొన్నప్ప గుట్టలో శుక్రవారం నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కాంక్షించారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.