VIDEO: జిల్లాలో కొనసాగుతున్న షాప్ బోర్డుల తొలగింపు

SRPT: జిల్లాలో రహదారికి అడ్డంగా, రెండు పక్కల ఉన్న షాప్ బోర్డులను ట్రాఫిక్ ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో బుధవారం రెండో రోజు తొలగించారు. షాపుల ముందు బోర్డులతో రోడ్ల మీద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయని, పాదచారులకు ఇబ్బందిగా మారాయన్నారు. వీటితో రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాలను అరికట్టేందుకే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.