రేపటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు
సంగారెడ్డిలోని జిల్లా కేంద్రంలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు 58వ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంజయ్య గురువారం తెలిపారు. 14న ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రతిరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.