అంతరాయం లేని విద్యుత్ సరఫరా కల్పించాలి

అంతరాయం లేని విద్యుత్ సరఫరా కల్పించాలి

అన్నమయ్య: రాయచోటి డివిజన్‌లో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆడేపూడి సోమశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లో వోల్టేజ్ సమస్యలు నివారించేందుకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్‌లపై అవగాహన పెంచి అమలు వేగవంతం చేయాలని తెలిపారు.