VIDEO: చెత్త సమస్యతో కాలనీవాసుల ఆగ్రహం

VIDEO: చెత్త సమస్యతో కాలనీవాసుల ఆగ్రహం

WGL: నెక్కొండ మండల కేంద్రంలోని నందమూరి నగర్ కాలనీలో చెత్త ఇష్టారాజ్యంగా పోగవుతోంది. ఎక్కడ చెత్త అక్కడే వేస్తున్నారని, గ్రామ పంచాయతీ పాలకులు, అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని నివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్తతో దోమలు, పురుగులు పెరిగిపోతున్నాయన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.