VIDEO: బెజ్జంకి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
SDPT: బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సిద్దిపేట సీపీ రశ్మి పెరుమాళ్ పరిశీలించారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తి భావంతో నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీపీకి ఆలయ కమిటీ తరఫున పురోహితులు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీను, ఎస్సై సౌజన్య, చైర్మన్ ప్రభాకర్ పాల్గొన్నారు.