నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 584.10 అడుగుల మేర నీరుంది. అధికారులు ప్రాజెక్టు 26 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 4,45,402 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,05,333 క్యూసెక్కులుగా ఉంది.