మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

NRML: భైంసా మండలం మహాగాం గ్రామంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో పాటు బీజేపీ అధిక సీట్లు కైవసం చేసుకోవడంతో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి మిఠాయిలు పంచారు. దేశానికి ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని కావడం గర్వకారణమన్నారు.