విద్యుత్ షాక్‌తో రైతు మృతి
ప్రకాశం: రాచర్ల మండలం మేడంవారిపల్లి గ్రామంలో చిన్న పుల్లయ్య అనే రైతు తన మొక్కజొన్న పొలంలో నీళ్లు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. పొలంలోకి వెళ్ళిన క్రమంలో అక్కడే ఉన్న విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ వైరు తగిలి ఈ విషాదం చోటుచేసుకుంది. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.