నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా రంజాన్ వేడుకలు

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా రంజాన్ వేడుకలు

నిర్మల్: ముస్లింల పవిత్ర పండుగ అయిన ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలో మైనార్టీలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనాలు చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ ముస్లింలకు  శుభాకాంక్షలు తెలిపారు.